ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు
మెట్ పల్లిలో గురువారం రాత్రి బతుకమ్మ పండుగ వేడుకలు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంటి ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు విద్యాసాగర్ రావు-సరోజన, మున్సిపల్ చైర్ పర్సన్ రానావేని సుజాత సత్యనారాయణ బతుకమ్మలను ఎత్తుకొని ఆడి అందరిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భం గా పట్టణంలోని అన్ని విధుల్లో బతుకమ్మ పాటలతో మహిళలు యువతులు ఆనందంగా ఉత్సాహంగా ఆడి పాడారు.