Print Friendly, PDF & Email

మండల పార్టీ అధ్యక్షులతో శాసనసభ్యులు చెన్నమనేని భేటీ!

0 282

శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ తో హైదరాబాద్ లో వేములవాడ నియోజకవర్గ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సమావేశమయ్యారు. ముందుగా రమేష్ కి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ జమ్మి పెట్టి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రమేష్ వారికి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ అధ్యక్షులు, సీ. ఎం కే. సీ. ఆర్, బీ. ఆర్. ఎస్ పార్టీ ఏర్పాటు నిర్ణయం, ఆవశ్యకత, నియోజకవర్గంలో కార్యక్రమాలు, నిర్మాణం, పటిష్టతకు, భవిష్యత్తులో సమన్వయం, మండల, గ్రామ శాఖల పార్టీ బలోపేతానికి కార్యాచరణపై చర్చించారు.

మండల పార్టీ అధ్యక్షులతో శాసనసభ్యులు చెన్నమనేని భేటీ!

పార్టీ కార్యకర్తలకు ఏదైనా యిబ్బందులు వుంటే నా దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరించడానికి భరోసా ఇచ్చారు. వీటితో పాటు పెన్షన్లు, దలితబందు, డబల్ బెడ్ రూం ఇండ్లు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, ముంపు గ్రామాల సమస్యలు, కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ నిర్మాణ ఆవశ్యకత, ఇథనాల్ ప్రాజెక్ట్, విద్యుత్, విద్య, వైద్యం, సీడీపీ నిధులతో శుద్ధ జల కేంద్రాలు ఏర్పాటు జిమ్ములు, మహిళ భవనాలు నిర్మాణం గురించి వివరించారు. రాబోయే కాలంలో మరిన్ని నామినేటెడ్ పోస్టులు రానున్నాయని మంచి గుర్తింపుగా పని చేస్తే మీలోనే రానున్న రోజుల్లో ప్రజా ప్రతినిధులుగా వుండే అవకాశం కూడా ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో మండలాద్యక్షులైన క్యాతం సత్తి రెడ్డి(మేడిపల్లి), గడీల గంగా ప్రసాద్( కథలాపూర్), దెగావత్ తిరుపతి నాయక్(రుద్రంగి), దయాల కమలాకర్ ( రుద్రంగి గ్రామ శాఖ), మ్యాకల ఎల్లయ్య, (చందుర్తి), గోస్కుల రవి( వేములవాడ రూరల్), వూరడి ప్రవీణ్ (వేములవాడ అర్బన్), మల్యాల దేవయ్య( కోనారావు పేట) పుల్కం రాజు (వేములవాడ పట్టణం) పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents