పోలీస్ గెస్ట్ హౌజ్ ప్రారంభించిన డిప్యూటి సిఎం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన పోలీస్ విశ్రాంత భవనాన్ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహాముద్ అలీ ప్రారంభించారు. పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సిపి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సుమారు 3కోట్ల 40లక్షల రూపాయల వ్యయంతో ఎన్టిపిసి నిధులతో నిర్మించిన రామగుండం కమిషనరేట్ నూతన పోలీస్ గెస్ట్ హౌజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోప్పుల ఈశ్వర్, డిజిపి మహేందర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపి వెంకటేష్, జడ్పి చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, కరీంనగర్ సిపి సత్యనారాయణ, డిసిపి రూపేష్, ఎసిపి గిరిప్రసాద్ తదితరులు పాల్గోన్నారు.