వెల్గటూర్ మండలం పాతగూడూర్ లో చిరుతపులి కలకలం… భయాందోళనలో ప్రజలు…?
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పడకంటి పాతగూడూర్ శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు పాతగూడూర్ గ్రానికి చెందిన సత్తయ్య అనే రైతు తెలిసిన వివరాల ప్రకారం తన పత్తి చేనులోకి పనికి వెళ్లగా చిరుతపులి కనిపించిందని .స్థానిక సర్పంచ్ కు సమాచారం ఇవ్వగా తను అడవి అధికారుకు సమాచారం అందించగా అధికారులు ఘటన స్థలానికి వెళ్లి చిరుతపులి అడుగులు కనుగొని 90 శాతం చిరుతపులి అడుగులని నిర్దారించినట్లు స్థానిక రైతులు తెలిపారు చుట్టుపక్కల రైతులు పంటపొలాలకు వెళ్ళటానికి ఆందోళనకు గురవుతున్నారు ఏది ఏమైనా పూర్తిస్థాయిలో సంబంధిత అధికారులు పులి అడుగుల లేక వేరే జంతువు అడుగుల అని నిర్ధారించే అంతవరకు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు అంటున్నారు.