Print Friendly, PDF & Email

హైకోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా(AGP) సాయి రాం(మున్నా )..

తన నియమకానికి సహకరించిన మంత్రులు కొప్పుల ,గంగుల ,సూడా చైర్మన్ జి.వి.ఆర్ , మేయర్ సునీల్ కు ధన్యవాదాలు..

0 51

ధర్మారం మండలం నంది మేడారం కు చెందిన ప్రముఖ న్యాయవాది పుసాల సాయిరాం (మున్నా ) హైకోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాది (AGP) గా నియమితులయ్యారు… సాయిరాం గతంలో తెలుగుదేశం పార్టీలో విద్యార్థి నాయకునిగా , కాంగ్రెస్ పార్టీలో PCC రాష్ట్ర కార్యదర్శి గా పని చేశారు. సాయి రాం కుటుంబం గత 40 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.. సాయి రాం తండ్రి హరిశంకర్ రావు గతంలో పి.పి గా పని చేసారు, పదవి విరమణ తరువాత అప్పటి కరీంనగర్ SP జోయల్ డేవిస్ కు ,పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి కు ,ప్రస్తుత సీపీ సత్యనారాయణ గారికి లీగల్ అడ్వైజర్ గా కొనసాగుతున్నారు.

సాయిరాం 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాసా) తరుపున కరీంనగర్ ఎంపి గా పోటీ చేస్తున్న బోయిని పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా కాంగ్రెస్ ను వీడి గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు… పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా కొనసాగుతు న్యాయ వాద వృత్తిని కొనసాగించారు..2016 నుండి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న సాయి రాం కు రెండు రోజుల క్రితం ప్రకటించిన హైకోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాదుల నియామకంలో AGP గా నియమితులయ్యారు.

తన నియమానికి సహకరించిన ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, మేయర్ యాదగిరి సునీల్ రావుకు సాయిరాం ధన్యవాదాలు తెలిపారు. సాయిరాం నియామకం పట్ల తన సొంత గ్రామం నంది మేడారం తో పాటు కరీంనగర్ కు చెందిన ప్రజాప్రతినిధులు ,నాయకులు అభినందనలు తెలిపారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents