రేపు తీన్మార్ మల్లన్న టీం జిల్లా సమావేశం
తీన్మార్ మల్లన్న టీం పెద్దపల్లి జిల్లా సమావేశం 16న (ఆదివారం) ఉదయం ఉంటుందని పెద్దపెల్లి జిల్లా కన్వీనర్ గుండావేన స్వామి తెలిపారు. మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు, గ్రామ కన్వీనర్లు, సభ్యులంతా సమావేశానికి హాజరు కావాలని కోరారు. సమావేశానికి ముఖ్య నాయకులు హాజరవుతారని ఈ సందర్భంగా వారు తెలిపారు. పెద్దకల్వల నూతన కలెక్టర్ కార్యాలయం దగ్గర రాజీవ్ రహదారి పక్కన సమావేశం ఉంటుందని తెలిపారు.