జగిత్యాలలో 41 మంది యువకులపై కేసులు నమోదు
జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి పట్టణ సీఐ కోరె కిషోర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చబుత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి కారణం లేకుండా ద్విచక్రవాహనాలపై త్రిబుల్ రైడిగ్ చేసుకుంటూ అర్ధరాత్రి తిరుగుతున్న 41 మంది యువకులను అదుపులోకి తీసుకోని వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.