వివాహితను వేధించిన వారిపై గృహహింస కేసు నమోదు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన అస్తుపురం పూజను అదనపు కట్నం కోసం వేదిస్తు గృహహింసకు పాల్పడ్డ వారిపై సోమవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. పూజకు 14 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా రేకుర్తి కి చెందిన ఆస్తుపురం శేఖర్ తో వివాహం కాగా సంతానం కలుగలేదు అనే కారణంగా నూకపల్లికి చెందిన కల్లు రాణిని రెండవ వివాహం చేసుకున్నాడు.
అప్పటినుండి తనపై వేదింపులకు పాల్పడుతూ అదనపు కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు మేరకు కుటుంబ సభ్యులైన కొమురయ్య, ఆడపడుచు మల్లారపు స్వప్న, గడ్డం మమత, గడ్డం రత్నాకర్, అస్తుపురం ఆంజనేయులు, విష్ణు ల పై గృహహింస కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వివరించారు