Print Friendly, PDF & Email

జర్నలిస్టులు పోరాటాలకు సిద్ధం కావాలి

0 5,889

జర్నలిస్టులు సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయకుమార్, ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 29, 30 తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడాకుల భిక్షపతి, ఫణి సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్ వినోద్, మారం తిరుపతిరెడ్డి, జాయింట్ సెక్రెటరీ సాబీర్ పాషా, కార్యవర్గ సభ్యులు బందెల రాజశేఖర్ పాల్గొన్నారు.

జర్నలిస్టులు పోరాటాలకు సిద్ధం కావాలి

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents