ప్రమాదానికి గురైన లారీ పరికరాల చోరి దొంగల అరెస్ట్
జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో వరద కాలువ వద్ధ 2017 నవంబర్ 4వ తేదీన ప్రమాదానికి గురైన జమ్మూకాశ్మీర్ కు చెందిన లారీ ఆక్సిడెంట్ అయినప్పటి నుండి అక్కడే ఉంటుంది. కాగా లారీలో పరికరాలు కట్ చేసి దొంగిలించిన ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
లారీలో పరికరాలు చోరికి గురైనట్టు గుర్తించి గ్రామ వి ఆర్ ఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగతనానికి పాల్పడ్డ జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ కు చెందిన బద్ద గోపాల్ సింగ్, టి ఆర్ నగర్ కు చెందిన జూని మహేందర్ లను అరెస్ట్ చేశారు. లారీ పరికరాలను రూ. 60000కు కొనుగోలు చేసిన కరీంనగర్ కు చెందిన కడమంచి సాయినాథ్ వద్ద రూ. 45000 నగదు, లారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వారి పై కేసు నమోదు చేశారు.