జడేజా భార్యకు ఎమ్మెల్యే టికెట్
గుజరాత్ ఎన్నికల్లో అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది. టీమిండియా అల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు బీజేపీ అవకాశం కల్పించింది. 2019లో బీజేపీలో చేరిన జడేజా భార్య రివాబాని గుజరాత్ నార్త్ జామ్‌నగర్ టికెట్ ను కేటాయించింది. కాంగ్రెస్ నాయకుడు హరి సింగ్ సోలంకికి రివాబా బంధువు. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు.