Print Friendly, PDF & Email

వామపక్షాల ఆధ్వర్యంలో మోడీ రాకను వ్యతిరేకిద్దాం

0 2,453

నవంబర్ 12న దేశ ప్రధాని రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఆర్ ఎఫ్ సి ఎల్ ను పున ప్రారంభించడానికి వస్తున్న తరుణంలో సిపిఐ, సిపిఐఎం, సి పి ఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ, ఎన్ ఐ పి ఆధ్వర్యంలో గురువారం రోజున రామగుండం, భాస్కరరావు భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సధానందం, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె. రాజన్న, సిపిఐఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామాచారి, ఎన్ఐపి పార్టీ అధ్యక్షులు జేవి రాజుగారు, పాల్గొని మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోరాటాలకు పురిటి గడ్డ రామగుండంకు వస్తున్న మోడీ రాకను వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అడ్డుకొని నిరసన తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.

గత ఏడాది ఆర్ ఎఫ్ సి ఎల్ లో యూరియా ఉత్పత్తి ప్రారంభమైతే నేడు పునః ప్రారంభానికి వస్తున్నారా లేక కార్పొరేట్ సంస్థలకు అమ్మకానికి వస్తున్నారా అని వారు ప్రశ్నించారు.

వామపక్షాల ఆధ్వర్యంలో మోడీ రాకను వ్యతిరేకిద్దాం

విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మిస్తూ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం పూనుకుందని వారు ఆరోపించారు.
నవంబర్ 12వ తేదీన అన్ని వామపక్ష పార్టీల ప్రజా సంఘాలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మోడీ రాకను అడ్డుకొని తీరుతామని సమావేశం తీర్మానం చేయడమైందని వారు పేర్కొన్నారు. అనంతరం నాయకులు గో బ్యాక్ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

సిపిఐ నగర కార్యదర్శి కే. కనకరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు మద్దెల దినేష్, తాళ్లపల్లి మల్లయ్య, టి. రమేష్ కుమార్, ఈదునూరి నరేష్, శనిగరపు చంద్రశేఖర్, మార్కాపూరి సూర్య, ఎం ఏ గౌస్, ఆరెపల్లి మానస్ కుమార్, వనపాకల విజయ్, మడికొండ ఓదెమ్మ, శనిగరపు తిరుమల, సిరిసిల్ల మల్లేష్ , జి. కుమారస్వామి, ఆసాల రమ, రేణిగుంట్ల ప్రీతం, ఎర్రల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents