కోతుల దాడిలో వ్యక్తి గాయాలు
కోతుల దాడిలో సింగరేణి కార్మికుడు పర్శ బక్కన్న గాయాల పాలయ్యారు. గురువారం మంథని పట్టణంలోని ఎరుకల గూడెం సమీపంలో సింగరేణి కార్మికుడు పర్ష బక్కన తన బంధువుల ఇంటి ఆవరణలో బంధువులతో ముచ్చటిస్తుండగా అకస్మాత్తుగా ఒకటేసారి మూకుమ్మడిగా దాడి చేయగా తీవ్ర గాయాల పాలయ్యారు హుటాహుటిన వెంటనే మంథని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. కోతులను అదుపు చేయాలని వార్డు ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు.