రామగుండంలో జరిగే సభకు బయలుదేరిన బిజెపి
ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు వస్తున్న దేశ ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం నుండి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాటి వెంకట్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు నేవూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లో మండల నాయకులు శనివారం వెళ్ళారు.
6300 కోట్లు పెట్టి ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి, తెలంగాణా యువతకు వేల ఉద్యోగావకాశాలు కల్పించి, కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి వస్తున్న భారత దేశ ప్రధనమంత్రి నరేంద్ర మోడీ కి స్వాగతం పలుకుతూ వారి సభా కి ఎల్లారెడ్డి పేట మండలం నుండి బీజేపీ నాయకులు పెద్దఎత్తున తరలివెళ్లారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అధికరప్రతినిధి బందరపు లక్ష్మారెడ్డి, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ సందుపట్ల రాజిరెడ్డి, మండల ప్రధానకార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి దూస శ్రీనివాస్, కిసాన్ మోర్చ ఐటీ జోనల్ ఇంఛార్జి చేకూటి అనూష్ యాదవ్, ఓబిసి ఉపాధ్యక్షుడు మిర్యలకర్ రవి, దరవత్ రవీందర్, సాందుపట్ల రాంరెడ్డి, వంగ శ్రీకాంత్ రెడ్డి, బురుక వేణు, గాజుల దాసు, నేవురి ప్రభాకర్, యమగొండ కృష్ణ రెడ్డి, దిటి నర్సయ్య, కిరణ్ నాయక్ నాయకులు పాల్గొన్నారు.