PM MODI: వాటిగురించి చింతిచకండి.. ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేయండి.. తెలంగాణ కార్యకర్తలకు మోదీ పిలుపు..

ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి శనివారం మద్యాహ్నం తెలంగాణ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడ ఏర్పాటుచేసిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చురకలంటించారు. భయంతో నన్ను తిట్టే వాళ్లు ఇక్కడ ఉన్నారని, వాటి గుకరించి కార్యకర్తలు ఎవరూ చింతించవద్దని.. ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలంటూ సూచించారు.25 ఏళ్లుగా తనకు చాలా వెరైటీ తిట్లు తనకు అలవాటేనని.. కార్యకర్తలు పెద్దగా పట్టించుకోవద్దంటూ టీఆర్‌ఎస్ నాయకులను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలను దోపిడీ చేసే వారిని ఎట్టి పరిస్తితి లో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు తనకు ఆదర్శమన్నారు. ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొని నిలుస్తున్నారని అన్నారు. మునుగోడు లో బీజేపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేశారని తెలిపారు. తెలంగాణలో రానున్న రోజుల్లో కమల వికాసం జరగుతుందన్నారు. తెలంగాణ చీకటి తరిమి సూర్యోదయం వస్తుందన్నారు.

తెలంగాణ సమాజం ఎంతో చైతన్యవంతమైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మీరెన్ని తిట్లు తిన్నా భరించే శక్తి తమకుందన్నారు. మోదీని తిట్టినంతమాత్రన తెలంగాణ అభివృద్ధి జరగదన్నారు. తన ప్రసంగం మొత్తం ఎక్కడా టీఆర్ఎస్, కేసీఆర్ పదాలను ఉపయోగించకుండానే పరోక్షంగా చురకలంటించారు. అవినీతికి సంబంధించి కూడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ పేమెంట్స్ తో అవినీతికి అడ్డుకట్టపడుతుందన్నారు. అవినీతి పరులను వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. కార్యకర్తలు కేత్రస్థాయిలో మరింత కష్టపడి పనిచేయాలని దాని ఫలితాలు త్వరలోనే చూస్తారన్నారు. తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు. ఓ వైపు పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే, కార్యకర్తలకు చెప్పాల్సింది సూటిగా చెప్పేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents