సిరిసిల్లలో దారుణం: మహిళను వివస్త్రను చేసి 4గంటలు కుర్చోపెట్టి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుష్యమైన ఘటన చోటుచేసుకుంది కూలి పని కోసం వేచి చూస్తున్నా మహిళను తన వద్ద పని ఉందని చెప్పి బండిపై తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు కామాంధుడు మహిళను వివస్త్రను చేసి నాలుగు గంటలు నరకం చూపించాడు ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్లలో లేబర్ అడ్డం మీదకు పని కోసం వచ్చిన 45ఏళ్ల వయసున్న మహిళను దుండగులు గమనించారు. తన వద్ద పని ఉందని నమ్మబలికి తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ వద్ద పని ఉందని మహిళకు చెప్పాడు నమ్మిన మహిళ అతని ద్విచక్ర వాహనంపైకి వెళ్ళింది లక్ష్మీపూర్ గ్రామం దాటి ఇల్లంతకుంట మండలం శివారులోని గండ్ల పోచమ్మ అటవీ ప్రాంతంలో బండి ఆపి మహిళ బట్టలు విప్పించి వివస్త్రను చేశారు, కోరిక తీర్చాలంటూ నాలుగు గంటలపాటు నగ్నంగా కూర్చోబెట్టినట్లు బాధితురాలు పోలీసుల విలపిస్తూ పేర్కొంది, తనకు ఆరోగ్యం బాగాలేదని ఆ మహిళ ఎలాగో అలా అక్కడి నుండి తప్పించుకొని బయటపడి పోలీసులను ఆశ్రయించింది.
విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట ఎస్సై మహేందర్ తన పోలీస్ సిబ్బందితో లక్ష్మిపూర్ గుట్టలు జల్లెడ పట్టారు సిరిసిల్లలో సైతం తనిఖీలు నిర్వహించారు మహిళా పోలీసుల సంరక్షణలో బాధిత మహిళ సఖి సెంటర్లో ఆశ్రయం పొందుతుంది కేసు నమోదు చేసిన పోలీసులు సిరిసిల్ల డిఎస్పీ ఆధ్వర్యంలో నిందితుని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఫోటోలు చూపించిన మహిళ గుర్తుపట్టడం లేకపోవడంతో పోలీసులు మరింత లోతుగా కేసులు దర్యాప్తు చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన సంచలం సృష్టించింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఆదేశాలతో ఈ కేసు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు పోలీసులు తీవ్రతరం చేశారు