కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి: MP అరవింద్
హైదరాబాద్‌లోని తన ఇంటిపై జరిగిన దాడిపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగిందన్నారు. దాడి సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంట్లో ఉన్న మా అమ్మను బెదిరించారని తెలిపారు. ఇంట్లో వస్తువులు పగలగొట్టి బీభత్సం సృష్టించారన్నారు. ఈ దాడి విషయాన్ని ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్లు అరవింద్ తెలిపారు.
కాగా, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు ధ్వంసం చేశారు. ఆయన ఇంటి ముందు దిష్టి బొమ్మ దహనం చేస్తూ బీభీత్సం సృష్టించారు.