పద్మశాలి కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల
కరీంనగర్: సమైక్య పాలనలో గత పాలకుల నిర్లక్ష్యంతో నేతన్నల జీవితాలు అంధకారంలో మగ్గేవన్నారు బిసి సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కడుపునిండా తిండి లేక ఆకలిచావులకు పాల్పడి సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం చామన్ పల్లిలో నూతనంగా నిర్మించిన పద్మశాలి కమ్యూనిటీ భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పురుమళ్ల శ్రీనివాస్, ఎంపిటిసి: టిప్పర్తి లక్షమయ్య, బొగొండ లక్ష్మి ఐలయ్య, చామనపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షలు: దూడం మల్లేశం, ప్రధాన కార్యదర్శి దాసరి ఆంజనేయులు, కోశాధికారి బూర్ల లక్ష్మీరాజం, కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షలు మెతుకు సత్యం, సంక్షేమ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు దూడం లక్ష్మీరాజం, అధ్యక్షులు స్వర్గం మల్లేశం, ప్రధాన కార్యదర్శి అల్స భద్రయ్య, యువజన సంఘం గౌరవ అధ్యక్షలు దూడం శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గుడిమళ్ల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి మహేశుని మల్లేశం, చామనపల్లి యువజన సంఘం అధ్యక్షులు దూడం శశిధర్ లు, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.