ఎమ్మెల్యేగా గెలిచిన జడేజా భార్య
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవబా జడేజా గెలుపొందింది. బీజేపీ తరఫున జామ్ నగర్ నార్త్ నుంచి పోటీచేసిన రీవబాకు 57శాతం, ఆప్ అభ్యర్థికి 23శాతం, కాంగ్రెస్కు 15.5శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ ముఖ్య నేత హరి సింగ్కు బంధువైన రీవబా 2019లో బీజేపీలో చేరారు. ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే రీవబా విజయం ఖరారు కావడంతో భర్త జడేజాతో కలిసి ఆమె విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.