మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్ లో గురువారం మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రవీందర్ సింగ్ కూతురి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్..నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో తేనీటి విందుకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలికారు. మంత్రి గంగుల కుటుంబ సభ్యులతో మాట్లాడి అనంతరము హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు బయలుదేరారు.