పాలు ఇస్తున్న ఏడాది వయసున్న దూడ
యూపీ గోరఖ్ పూర్ లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. సంతానం లేకుండా ఏడాది వయసున్న ఓ దూడ పాలిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఖోరాబర్ లోని జార్వా నివాసి గిరి నిషాద్ 15 రోజుల క్రితం ఓ దూడను ఇంటికి తీసుకు రాగా వారం తర్వాత అది పాలు ఇవ్వడం ప్రారంభించింది. మొదట్లో తక్కువగా ఇచ్చేదని ఇప్పుడు 4 లీటర్ల పాలు ఇస్తుందని యజమాని తెలిపారు. ఈ వింతను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అయితే జన్యుపరమైన హార్మోన్ల కారణంగా ఇలా జరుగుతుందని పశు వైద్యులు తెలిపారు.