TRSను BRSగా గుర్తించిన ఈసీ
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ని భారత్ రాష్ట్ర సమితి (BRS)గా పేరు మార్పునకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది. త్వరలోనే సంబంధిత నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. దసరా రోజున టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తున్నట్లు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పేరు మార్చాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనిపై అభ్యంతరాల కోసం నెల పాటు గడువు ఇచ్చిన ఈసీ నేడు పేరు మార్పును ఆమోదించింది.