Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

ఇదేం వింత… గాల్లోనే ఆగిపోయిన షటిల్ కాక్..

0 64,431

 భూమ్మీద మనుషులు నిలబడుతున్నారన్నా.. పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మిస్తున్నామన్నా.. కారణం గురుత్వాకర్షణ శక్తి. దీన్ని భూమ్యాకర్షణ శక్తి అని కూడా అంటారు.

అదేనండీ.. ఇంగ్లీషులో గ్రావిటీ అని పిలుస్తారు. న్యూటన్ చెప్పిన ఈ థియరీని చిన్నప్పుడే అందరూ చదువకుని అంటారు. చెట్టు నుంచి యాపిల్‌ కిందపడితే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్‌ కనిపెట్టాడు. కానీ ఏదైనా వస్తువును ఆకాశంలోకి విసిరినప్పుడు అలానే అది పైన ఉండిపోతే.. అయ్య బాబోయ్ అలా జరిగితే ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. అయితే అలాంటి ఓ విచిత్ర ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగుచూసింది.

నవరం మండలం టేకులబోరు బీసీ కాలనీలో కొంతమంది చిన్నారులు బుధవారం సాయంత్రం షటిల్ ఆడుతుండగా.. మధ్యలో ఒక్కసారిగా కాక్ గాల్లోనే ఉండిపోయింది. ఎటువంటి సపోర్ట్ లేకుండా కాక్ అలా ఉండటంతో పిల్లలు ఆశ్చర్యానికి లోనయ్యారు. కొద్ది నిమిషాల కాక్ అలానే ఉండిపోయిందని.. ఆ తర్వాత షటిల్ బ్యాట్ పైకి విసరడంతో అది కిందపడిందని ఆ కిడ్స్ చెబుతున్నారు. ఈ వింత ఘటనను వారు ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. ఇదేలా సాధ్యం అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు.

Shuttlecock: వాయమ్మో ఇదేం వింత గురూ.. గాల్లోనే ఆగిపోయిన షటిల్ కాక్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా

దీనిపై భిన్న వాదన చేసేవారు కూడా ఉన్నారు. అక్కడి కరెంట్ తీగకు సాలెపురుగు గూడు పెట్టిందని.. ఆ గూడులో కాక్ చిక్కుకుందని కొందరు అంటున్నారు. ఇంకొందరు అయితే ఈ వీడియో ఫేక్ అని.. కేవలం వైరల్ చేసేందుకు వీడియోను అలా క్రియేట్ చేశారని చెప్పుకొస్తున్నారు. మరి అసలు విషయం ఏంటి అన్నది తేలాల్సి ఉంది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents