కాంగ్రెస్ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని పలుచోట్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సోనియా గాంధీ కి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందని, సోనియా గాంధీ శ్రేయస్సును కోరిన అయ్యప్ప స్వామి మాలదారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ఆలయంలో నేడు బిక్ష కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎంతోమంది ఉద్యమకారుల బలిదానాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ సంకల్పించడం వల్లనే నేడి రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఇంకెవరి వల్ల సాధ్యం కాలేదని, నాడు వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండక పోయి ఉంటే ఆంధ్ర నాయకత్వం ఒత్తిడి మేరకు నేటికీ తెలంగాణ వచ్చి ఉండేది కాదు, నాడు బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే నరేంద్ర మోడీ మాటలను బట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక నెరవేరని కలగా మిగిలిపోయి ఉండేదని అన్నరు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి నేడు మనందరం పాలాభిషేకాలు చేస్తూ, ఆలయాల్లో పూజలు చేసుకుంటూ, వేడుకలు జరుపుకుంటున్నామని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యంగా సామాజికంగా సుపరిపాలన అందించే రోజు కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలన్నారు. వారు కన్న కలలను నెరవేర్చే విధంగా ప్రతిజ్ఞ చేసి ముందుకు నడవాలని, ఇప్పుడున్న నియంతృత ప్రభుత్వాలను ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న ప్రభుత్వాలను ఇచ్చిన హామీలను అమలు చేయని, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరుతున్నాను అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని ఈ జిల్లా ప్రజల మనసులో వారికి ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు.