65 గంటలుగా బోరు బావిలోనే చిన్నారి
మధ్యప్రదేశ్‌లో బోరు బావిలో పడిన 8 ఏళ్ల తన్మయ్‌ని 65 గంటలు దాటినా కాపాడలేకపోవడంపై ఆమె తల్లి జ్యోతి సాహు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఏం చేసైనా నా కొడుకును నాకు ఇచ్చేయండి. ఇదే ఓ రాజకీయ నాయకుడు, అధికారుల పిల్లలైతే ఇంత సమయం పడుతుందా. వాడు మంగళవారం పడిపోయాడు. ఇవాళ శుక్రవారం. నా కొడుకును ఎలాగైనా బయటకు తీయండి. ఒక్కసారి వాడిని చూడాలి అని కన్నీరు పెట్టుకున్నారు. కాగా బేతుల్ జిల్లాలోని మాండవి గ్రామంలో 400 అడుగుల లోతు బోరు బావిలో 55 అడుగుల వద్ద తన్మయ్ చిక్కుకున్నాడు. అతడిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.