Print Friendly, PDF & Email

Pushpa The Rule: పుష్ప 2లో రామ్ చరణ్… లీకైన క్లైమాక్స్ ట్విస్ట్

0 30,619

తెలుగు సినిమా స్థాయి గతంలో కంటే ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి. దీనికి కారణం కొంత కాలంగా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా చిత్రాలు రావడం..

అవి దేశ వ్యాప్తంగా హవాను చూపించడమే. అలా వచ్చిన వాటిలో ‘పుష్ప ద రైజ్’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో తెలిసిందే. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప 2లో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఓ ట్విస్ట్ కూడా రివీలైంది. ఆ వివరాలు మీకోసం!

దేశ వ్యాప్తంగా హవా… రష్యాలో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే ‘పుష్ప’. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి విజయం సాధించింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది. ఇక, ఇప్పుడు రష్యాలో కూడా ఈ సినిమా విడుదల అయింది.

గుర్తుందా శీతాకాలం ట్విట్టర్ రివ్యూ: తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. సినిమా టాక్ అలా.. ఇంతకీ హిట్టేనా!

కోట్ల లాభాలతో రికార్డుల మోత

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్‌తో రూపొందిన ‘పుష్ప’కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్లకు పైగా లాభాలు కూడా లభించాయి.

రూల్ చేయడానికి పుష్ప రెడీ

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప’ మూవీ రెండు భాగాలుగా రాబోతుందని చిత్ర యూనిట్ ముందే ప్రకటించింది. ఇందులో మొదటి దాన్ని ‘పుష్ప.. ద రైజ్’ టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి ‘పుష్ప.. ద రూల్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

షూట్ స్టార్ట్… మరో షెడ్యూల్

‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అలాగే, వచ్చే వారం నుంచే రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది.

పుష్ప 2లో రామ్ చరణ్ కూడా

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘పుష్ప ద రూల్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో ఎంతో మంది స్టార్లను భాగం చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ చిత్రం కోసం రామ్ చరణ్‌ను ఓ కీలక పాత్ర కోసం ఒప్పించినట్లుగా తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

ముందే లీకైన క్లైమాక్స్ ట్విస్ట్

ముందే లీకైన క్లైమాక్స్ ట్విస్ట్
ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ‘పుష్ప ద రూల్’ మూవీలో ప్రీ క్లైమాక్స్ సమయంలోనే రామ్ చరణ్ పాత్ర ఎంట్రీ ఉంటుందట. అప్పటి నుంచి సినిమా పూర్తయ్యే వరకూ అల్లు అర్జున్‌తో కలిసి ప్రత్యర్థులపై పోరాటం చేస్తాడని అంటున్నారు. ఇలా ఈ సినిమా క్లైమాక్స్‌లో చరణ్ పాత్రను హైలైట్ చేసి ముగించే విధంగా ప్లాన్ చేసినట్లు తెలిసింది.

టాలీవుడ్ చరిత్రలో తొలిసారి

తమిళంలో లోకేష్ తనకంటూ ఒక యూనివర్శ్‌ను క్రియేట్ చేయడం కోసం వరుసగా సినిమాలు చేస్తూ కొందరిని అందులో భాగం చేస్తున్నాడు. ఇప్పుడదే ఫార్ములాను తెలుగులో సుకుమార్ ఫాలో అవుతున్నాడని తెలిసింది. అందుకే చిట్టిబాబు పాత్రను పుష్పరాజ్ రోల్‌కు జత చేయబోతున్నాడట. దీని ప్రకారం.. పుష్పకు మరో సీక్వెల్ పెట్టి.. రామ్ చరణ్‌ను హీరోగా పెట్టే ఛాన్స్ ఉందని టాక్.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents