ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ జహనమైన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు ఇనుపాముల స్టేజీ వద్ద డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో మంటలు చెలరేగి కాలిబూడిదైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఐదుగురు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు, క్షతగాత్రులు సూర్యాపేటకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.