కేజీఎఫ్ లో మళ్లీ పసిడి వేట!
20 ఏళ్ల క్రితం మూతపడిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) తలుపులు మళ్లీ తెరుచుకోనున్నాయి. బెంగళూరుకు దాదాపు 65 కి.మీ దూరంలో ఉన్న కేజీఎఫ్ లో మళ్లీ బంగారం వెలికితీయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 50 మిలియన్ టన్నుల శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికితీసేందుకు బిడ్లను ఆహ్వానించాలని కేంద్రం చూస్తున్నట్లు.. ఈ గనులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారి తెలిపారు. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బంగారంతో పాటు పల్లాడియంను కూడా వెలికితీయనున్నట్లు సమాచారం.