BRS భరతం పట్టే రోజు దగ్గర్లోనే ఉంది: ఈటల రాజేందర్
హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ పై విరుచుపడ్డారు. బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సభకు హాజరైన ఈటెల ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై విమర్శలు గుర్తించారు. బిఆర్ఎస్ భారతం పట్టే రోజు త్వరలోనే ఉందని వ్యాఖ్యానించారు. మార్పునకు నాంది కరీంనగర్, డబ్బులకు ఎదురొడ్డిన జిల్లా కరీంనగర్, అంటూ ప్రసంగం మొదలుపెట్టారు ఈటెల రాజేందర్. హుజురాబాద్ లో 4వేల కోట్లు ఖర్చు చేసిన ప్రజలు కేసీఆర్ చంపచెల్లుమనిపించారని అభిప్రాయపడ్డారు. 8 ఎళ్లలో రూ, లక్షల కోట్లు ఎక్కడినుండి వచ్చాయో కెసిఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా నిలిచిన జిల్లా కరీంనగర్ అని వ్యాఖ్యానించారు బారాసకు భరతం పట్టి రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు బదులు పెట్టినప్పుడు శ్రీరామ రక్ష అని కెసిఆర్ అన్నారని గుర్తు చేశారు. గత నాలుగు నెలలుగా అక్కడికి చీమను కూడా పోనివ్వడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద పోలీసులు తప్ప ఎవరిని పోనివ్వట్లేదని విరుచుకుపడ్డారు. రైతుల భూములను నిండా ముంచి నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి కెసిఆర్ అని వ్యాఖ్యానించారు.