తప్పిపోయిన చిన్నారిని గుర్తించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హారకబాద్ గ్రామస్తులైన కుసుబ సురేందర్ -నిర్మల దంపతులు బ్రతుకుదెరువు కోసం మూడేళ్ళ క్రితం హుజురాబాద్ పట్టణం కు వచ్చి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా గురువారం హుజురాబాద్ లో సంతకు తల్లితో వెళ్లిన 6సంవత్సరాల వయసున్న దుర్గ తప్పి పోయింది. తల్లుదండ్రులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దుర్గను గుర్తించి సాయంత్రం వారికి అప్పగించినట్లు ఎస్ఐ రాజన్న తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఎస్సై రాజన్న, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, యాకూబ్, హోంగార్డు మొండయ్య మహిళా హోంగార్డు సౌజన్య లు ఉన్నారు.