Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

కరీంనగర్ లో అగ్నిప్రమాదం – భారీ నష్టం

0 43,603

కరీంనగర్ సమీపంలో తెల్లవారు జామును చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్దారించారు.

శుక్రవారం కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న గోదాంలో తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

ఈ గోదాంలో గన్నీ బ్యాగులే ఉండడంతో అగ్ని కీలలకు సంచులన్నీ కాలి బూడిదయిపోయాయని అంచనా వేస్తున్నారు. సుమారు 40 వేల గన్నీ బ్యాగులు ఇందులో ఉన్నాయని, రూ. 12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గోదాం యజమానులు చెప్తున్నారు. అధికారులు మంటలు పూర్తిగా చల్లారిన తరువాత నష్టాన్ని అంచనా వేయనున్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents