కుర్ కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు!
పిల్లలు ఇష్టంగా తినే కుర్ కురే ప్యాకెట్లలో కరెన్సీ నోట్లు బయటపడిన ఘటన కర్ణాటకలోని రాయచూర్ లో జరిగింది. రాయచూర్ జిల్లా లింగసుగూర్ తాలూకా హునూర్ గ్రామంలో వివిధ కంపెనీల కుర్ కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు కనిపించడంతో జనం ఎగబడ్డారు. ఇలా వివిధ ప్యాకెట్లలో సుమారు రూ.20 వేల వరకూ డబ్బు దొరికింది. ఈ విషయం చుట్టుపక్కల తెలియడంతో కుర్ కురే కొనుగోళ్లతో దుకాణాలు నిండిపోయాయి. అయితే నాలుగైదు రోజులుగా దొరికిన ఈ నోట్లు నకిలీవా, అసలైవనేనా అనే విషయంలో గందరగోళం నెలకొంది.