Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

అచ్చం అబ్బాయిలా ఉన్నావు.. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావా అంటూ జబర్దస్త్ వర్షపై ట్రోల్స్?

0 18

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ మొదటిలో లేడీ పాత్రల కోసం అబ్బాయిలే అమ్మాయిల గెటప్ వేసి రచ్చ చేస్తూ ఉండేవారు.

కానీ ఈ మధ్య క్రేజ్ కోసం రియల్ అమ్మాయిలు జబర్దస్త్ లో అడుగుపెట్టి లేడీ కమెడియన్స్ గా హడావిడి చేస్తున్నారు. అలా చాలావరకు స్టార్ కమెడియన్ ఆది ఎంతోమంది టాలెంట్ ఉన్న అమ్మాయిలను స్టేజ్ పైకి తీసుకువచ్చాడు.

ఇక అలా ఆ విధంగా పరిచయమైన ముద్దుగుమ్మనే వర్ష. ఈమె ఆది స్కిట్ లతో పాటు ఇతర కమెడియన్ స్కిట్ లలో కూడా కనిపించింది. పైగా మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి బాగా రచ్చ రచ్చ చేస్తుంది. వర్ష తొలిసారి బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా పరిచయమై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Jabardasth Varsha Buys New Car Worth Of 20 Lakhs Become Talk Of The Town,  Know About Varsha Car | Jabardasth Varsha: కొత్త కారు కొన్న 'జబర్దస్త్'  వర్ష - రేటు ఎంతో తెలిస్తే షాక్ గ్యారెంటీ

ఆ తర్వాత జబర్దస్త్ లో అడుగు పెట్టగా సీరియల్స్ కు దూరంగా ఉంటూ మొత్తం షోలలోనే బిజీగా మారింది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగా సందడి చేస్తుంది వర్ష. ఇతర ఈవెంట్లలో కూడా పాల్గొని తెగ రచ్చ రచ్చ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ అందాలతో నెటిజన్ల ను సోషల్ మీడియాలో ఫిదా చేస్తుంది.

ఇక ఈమెను ఇప్పటికే చాలాసార్లు జబర్దస్త్ వేదికపై బాగా ట్రోల్స్ చేశారు. ఎందుకంటే వర్ష అబ్బాయిలా ఉంటుందని.. ఆమె గొంతు కూడా అచ్చం అబ్బాయి లా ఉంటుంది అని.. ఆమె గెటప్ వేసుకున్న లేడీ కమెడియన్ అంటూ ఆమెను నానారకాలుగా కామెంటు చేయటంతో ఓసారి తను వేదికపై చాలా సీరియస్ అయింది. ఇక చాలామంది ఇదంతా ఫేక్ అని.. రేటింగ్ కోసం ఇలా చేస్తుంటారు అని ఘోరంగా ట్రోల్స్ చేశారు. ఇక అలా తనను అనటంతో చాలాసార్లు బాధపడింది వర్ష. అప్పుడప్పుడు స్కిట్ లలో కూడా ఆమెపై అటువంటి కౌంటర్లే వేస్తుంటారు ఇతర కమెడియన్స్. తర్వాత అవన్నీ తట్టుకొని ధైర్యంగా నిలబడి తనేంటో తాను చూసుకుంటుంది వర్ష. ఇక సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ అందాలను బయట పెడుతూ బాగా సందడి చేస్తుంది. ఎద, నడుము అందాలతో కుర్రాళ్లను తనవైపు మలుపుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెకు బాగా ట్రోల్స్ వస్తుంటాయి. అందులో కూడా లేడీ గెటప్ అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా అందులో తన అందాలతో మరింత రచ్చ చేసింది వర్ష. అయితే ఈసారి కూడా ఓ నెటిజన్ దారుణంగా ట్రోల్ చేశారు. నీ ఫేస్ అచ్చం అబ్బాయి లాగా ఉంది ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా అంటూ ట్రోల్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents