అందంగా ముస్తాబు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రాజగోపురం
కరీంనగర్ పట్టణంలోని మంకమ్మతోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క రాజగోపురం అందంగా ముస్తాబు అయ్యింది. శ్రీ వెంకటేశ్వర దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు అయినా 45వ డివిజన్ కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాజగోపురాన్ని అందంగా తీర్చిదిద్దారు. నూతనంగా నిర్మించిన రాజగోపురానికి అందమైన రంగులు వేయడంతో పట్టణ ప్రజలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్ కు భక్తులు కృతజ్ఞతలు తెలిసాయజేశారు.