కరీంనగర్ లో వింత ఘటన : ట్రాన్స్ జెండర్ ను వివాహమాడిన యువకుడు
ట్రాన్స్ జెండర్ ను ఓ యువకుడు వివాహమాడిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో శుక్రవారం జరిగింది. వీణవంకకు చెందిన దివ్య కొంత కాలంగా జమ్మికుంట పట్టణంలో జీవనం సాగిస్తుంది. గతంలో జగిత్యాలలో ఉన్నప్పుడు ట్రాన్స్ జెండర్ గా మారినప్పుడు అక్కడే పరిచయమైన అర్షద్ తనను పెళ్లి చేసుకుంటానని రెండు మూడు సార్లు ప్రపోజ్ చేయగా మొదట్లో నిరాకరించిన దివ్యను ఒప్పించేందుకు గురువారం జమ్మికుంటకు వచ్చిన అర్షద్ హర్షిత్ గా మారి ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న హర్షిత్ ఇక ముందు దివ్య చెప్పినట్టుగా నడుచుకుంటా అని వివాహ బంధంతో ఒక్కటైన తాము ఆదర్శవంతమైన జీవితం గడుపుతామన్నారు. అనంతరం జమ్మికుంటలో ఒక్కటైన ఈ జంట ఇల్లంతకుంట రామాలయంలో పూజలు చేశారు.