ముగింపు సభ విజయవంతం – జీర్ణించుకోలేక మతిభ్రమించి మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకులు
శుక్రవారం కరీంనగర్ లో పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ విజయవంతం చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి, కష్టపడి పని చేసిన బిజెపి శ్రేణులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అశేష సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయడంతో, బి ఆర్ ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదని , అందుకోసమే మతిభ్రమించి , అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ, పనికిమాలిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కరీంనగర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మండిపడ్డారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కరీంనగర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ బి ఆర్ఎస్ నాయకులు వాళ్ల ఉనికి కోసమే అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వ కనుసనల్లోనే కాంగ్రెస్ నడుచుకుంటుందని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా బిజెపి శ్రేణులను ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధిస్తారు, కానీ బి ఆర్ఎస్ , కాంగ్రెస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టు చేయకుండా జేపీ నడ్డా పర్యటనకు అడ్డు తలిగేలా సహకరించడం లాంటివి చూస్తే ఆంతర్యం అర్థమవుతుందన్నారు. ముఖ్యంగా మేయర్ సునీల్ రావుకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ నగర అభివృద్ధి పై ఉంటే బాగుంటుందన్నారు. బిజెపిసభకు కుర్చీలు, టెంట్ల గురించి మెటీరియల్ సప్లై చేసిన వ్యాపారస్తునిలా సంఖ్యతో సహా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కరీంనగర్ గడ్డ బిజెపి అడ్డ అని లోగడ జరిగిన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లోనే నిరూపించారని, లక్ష మెజారిటీతో బండి సంజయ్ కుమార్ గెలిచారనే విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. మేయర్ సునీల్ రావు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ లు కెసిఆర్ మెప్పు పొందడానికి , బానిసల్ల మారి అవగాహనరాహిత్యంతో పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ తనదైన శైలో పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. ఆ దిశలోనే 4600 కోట్లతో నేషనల్ హైవే ను సాధించారని, గ్రామాల్లో అంతర్గత రోడ్లు రహదారుల కోసం, రెండు వరుసల రహదారుల కోసం, తగిన నిధులు కేటాయించి అభివృద్ధి చేయిస్తున్నారు. విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారని ఆ దిశలోనే ప్రజలఆరోగ్య భద్రత కోసం పెద్దపీట వేసి తన వంతుకృషి చేశారని పేర్కొన్నారు. సొంత ఖర్చులతో వైద్య పరికరాలు అందించారని, వికలాంగుల కోసం అవసరమైన పరికరాలు సమకూర్చారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం, నూతన రైలు మార్గాల కోసం, తెగలగుట్టపల్లి ప్రాంతంలో ఆర్ఓబి ఏర్పాటు కోసం కృషిచేసి తగిన నిధులు కేటాయింప చేశారని తెలిపారు.
లోగడ ఇక్కడి నుండి పనిచేసిన టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కంటే మెరుగ్గా ఎంపీ బండి సంజయ్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పనులు బిఆర్ఎస్ నాయకులకు కనబడడం లేదా చూడలేకపోతున్నారా అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంఅభివృద్ధి కోసం దమ్ము ధైర్యంతో పనిచేస్తున్న బండి సంజయ్ పై రాజకీయ విమర్శలు చేస్తున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు డి పి ఆర్ ఏంటి , ఎవరి అవసరాల కోసం ప్రాజెక్టు నిర్మించారు, ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత, అనే వివరాలు తెలియజేయకుండా కెసిఆర్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారిన కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమనడం , దీనిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బి ఆర్ఎస్ నాయకులకు కెసిఆర్ దగ్గర మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే, కరీంనగర్ అభివృద్ధి కోసం కొట్లాడి సాధించుకోవాలని సూచించారు.
కిసాన్ నినాదంతో దేశ రాజకీయాల్లోకి ప్రవేశించిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి మేలు చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఎన్నికల హామీ చేయనోళ్లు రైతుల కోసం పనిచేస్తామంటే ఎవరు నమ్ముతారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దేశంలో బి ఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమిత అవుతుందని, రాబోయే ఎన్నికల్లో బి ఆర్ఎస్ కు వి ఆర్ఎస్ ఖాయమని ఆయన జోష్యం చెప్పారు.