సబ్బండ వర్ణాలకు న్యాయం చేస్తాం
ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చిన సీఎం కేసీఆర్రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ పెల్లి గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. మంగళవారం మండల గన్నరువరం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కవ్వపల్లి సత్యనారాయణ మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసిఆర్ దక్కిందన్నారు. నూతన మండలంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజల సమస్యలను పక్కన పెట్టి, ఆర్బాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారు. 57 ఏండ్లు నిండిన వారు చాలా మంది ఉన్నా కొందరికే పెన్సన్లు ఇచ్చి సైట్‌ను మూసేశారు. ఆగమేఘాల మీద గుండ్లపల్లి నుంచి కొండాపూర్ వరకు ఉన్న డాంబర్ రోడ్డును తవ్వేశారని, ఇప్పటికీ 25 రోజులు అవుతున్నాపట్టింపులు లేవన్నారు. ప్రయాణీకులు, వాహనదారులు కంకర రోడ్డు పై పడుతూ, లేస్తూ ప్రయాణాలు చేస్తున్నారన్నారు. డీసీసీ అధ్యక్షుడు కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించి ప్రయాణీకులు ఇబ్బందులు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్కూరి అనంతరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మెర రవీందర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్, బీసీ సెల్ మండల అధ్యక్షులు కొలుపుల రవీందర్, ముస్కు ఉపేందర్‌రెడ్డి, రాపోలు అనిల్, ఏలేటి సతీష్ రెడ్డి, చిట్కూరి కొమురయ్య యువకులు పాల్గొన్నారు.