అర్ధరాత్రి రోడ్డుపై మందుబాబుల వీరంగం
జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో మంగళవారం అర్ధరాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో హల్చల్ చేస్తు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మందుబాబులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులతో వారు దుర్భాషలాడారు. దీంతో ఇద్దరు మందు బాబులపై కేసు నమోదు చేశారు.