పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్
బుధవారం ఎర్ర మంజిల్ లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్.
ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ, నాకు ఇంతటి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఋణపడి ఉంటానని మంత్రి గంగుల తో కలిసి పనిచేసి సివిల్ సప్లై కార్పొరేషన్ కు మంచి పేరు తెస్తాను అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 1600 రైస్ మిల్లులు ఉంటే ఇవాళ 2600 పైగా రాష్ట్రంలో రైస్ మిల్లులు ఉన్నాయి. వరి ధాన్యం కోటి టన్నులు పండుతుంది, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది అన్నరు.
పంజాబ్ రాష్ట్రం కంటే కూడా అధికంగా తెలంగాణ రాష్ట్రం లో వరి ధాన్యం పండుతుంది. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం ఒక్క ఉద్యమం గా చేస్తున్నారు అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైస్ మిల్లులో 100 మొక్కలు నాటలి అన్నారు రవీందర్ సింగ్.
హాజరైన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు.