రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు
మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ బుధవారం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు జిల్లా కోర్టు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్టు సలహా మండలి సభ్యులు పివి రాజ్ కుమార్, సి విక్రమ్ కుమార్, పంజాల విజయభాస్కర్, బండ గోపాల్ రెడ్డి, సర్దార్ అర్జిత్ సింగ్, సుంకే దేవకిషన్, తవుటు మురళి రవీందర్ సింగ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై అభినందనలు తెలిపారు.