‘ఏసుక్రీస్తు వల్లే కరోనా తగ్గింది’ : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
ఏసుక్రీస్తు దయవల్లే భారత్లో కరోనా తగ్గిందని వ్యాఖ్యానించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఖమ్మంలో సెమీక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన క్రైస్తవం వల్లే ఇండియా అభివృద్ధి చెందిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మానవ మనుగడకు క్రైస్తవ మతమే అభివృద్ధి నేర్పింది. చాలా మంది దేవుళ్లు ఉన్నా మన కళ్ల ముందు నడియాడిన దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే” అని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి ఈయన వార్తల్లో నిలిచారు