భారత్‌లో ప్రవేశించిన ఒమిక్రాన్ బీఎఫ్ 7
భారత్‌లో ప్రమాదకర కరోనా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ ప్రవేశించింది. గుజరాత్‌లోని వడోదరలోని ఓ ఎన్ఆర్ఐ మహిళలో బీఎఫ్ 7 వేరియంట్‌ను అధికారులు తాజాగా గుర్తించారు. దీంతో అన్ని ఎయిర్పోర్టుల్లోనూ కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. చైనా కరోనా వ్యాప్తికి బీఎఫ్ 7 వేరియంట్ కారణం. దీంతో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఎఫ్ 7 వేరియంట్ కేసులు ఇప్పటి వరకు గుజరాత్లో 2, ఒడిశాలో ఒకటి నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ముగ్గురితో పాటు వారికి సన్నిహితంగా ఉన్న వారిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు.