ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్
-గట్టుబూత్కూర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కప్ బహుమతి ప్రధానోత్సవంలో కంసాల శ్రీనివాస్ కార్పొరేటర్
ఆధార్ స్వచ్ఛంద సంస్థ మరియు తెలంగాణ సోషల్ ఫీవర్ ద్వారా ఏర్పాటు చేసిన చొప్పదండి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గట్టుభూత్కూర్లో గత నెల రోజులుగా ఆర్గనైజ్ చేస్తూ ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆడి గెలిచిన విజేతలకు మరియు రన్నర్ గా నిలిచిన వారికి బహుమతి ప్రధానోత్స కార్యక్రమం గట్టుబొత్కూర్ గ్రామంలో చాలా ఘనంగా జరిగింది
ఫైనల్ మ్యాచ్లో గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామం విజేతగా నిలిచింది వారికి కంసాల శ్రీనివాస్ గారు బహుమతి కప్ తో పాటు 40,000 ప్రైజ్ మనీ అందించడం జరిగింది. అలాగే రన్నర్ గా నిలిచిన జట్టుకు 20వేల ప్రైజ్ మనీ అందించడం జరిగింది
ఈ సందర్భంగా కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ మాట్లాడుతూ కెసిఆర్ గారు తెలంగాణ ప్రభుత్వంలో క్రీడలకు క్రీడాకారులకు అధిక ప్రోత్సాహం లభిస్తుందని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులలో ఉన్న ప్రతిభను బయటికి తీసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ప్రతి గ్రామంలో కూడా ఒక క్రీడా ప్రాంగణం ఉండాలని కేసీఆర్ గారు ఆలోచన చేసినారని కేవలం చదువుతూనే ఉన్నత శిఖరాలను లభించమని ఆటలతో కూడా గొప్ప లక్ష్యాలు శిఖరాలు చేరుకోవచ్చని తెలిపారు పదవ తరగతి ఉత్తీర్ణత లేని సచిన్ టెండుల్కర్ భారతరత్నగా గొప్ప ఆటగాడిగా మన్నలని పొందాడని క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు మానసిక శారీరక దృఢత్వంతో పాటు ఉద్యోగ అవకాశాలలో కూడా క్రీడలకు రిజర్వేషన్ ఉంటుందని అనారోగ్యాల బారిన పడకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు క్రీడలు తోడ్పడతాయని తెలిపారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన వారికి చాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీనివాస్ గారు వేయి రూపాయల చొప్పున ప్రోత్సాహ అందించారు. నెల రోజులపాటు శ్రమించే ఆర్గనైజ్ చేసిన భాస్కర్, అజయ్, జిత్తులను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కంసాల శ్రీనివాస్ కార్పోరేటర్ మరియు ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మరియు స్థానిక కార్పొరేటర్ కంకణాల విజయేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్ రెడ్డి, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టమల్ల శ్రీనివాస్, ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు మండల స్థాయి నాయకులు స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి ముల్కల గంగారం, సోషల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కోట రాములు యాదవ్, టూవీలర్ మెకానిక్ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి బాబు, యువసేన నాయకులు పాల్గొన్నారు.