అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని కోరుట్ల ఎస్ఐ పట్టుకున్నారు. కల్లూరు గ్రామ సమీపంలో డీసీఎం వ్యానులో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిర్ర సతీష్ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక పనులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సతీష్ కుమార్ హెచ్చరించారు.