ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన
కవిత మనుషులమని ఎమ్మెల్యే అణిచివేత, మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన భోగ శ్రావణి ప్రవీణ్ ప్రకటన
జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ తన నివాసంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. గత 3 సంవత్సరాల నుండి ప్రశ్నించడంతోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడుగడుగునా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పోతున్న అని ఆవేదన చెందారు. మీకు పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి, జాగ్రత్త అని ఎమ్మెల్యే భేదిరించారాని శ్రావణి ప్రవీణ్ ఆరోపించారు. ఎమ్మెల్యే డబ్బులు కోసం డిమాండ్ చేస్తున్నారని,మేము ఇచ్చుకోలేం మన్నారు.దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్ష గట్టారు అన్నారు. మున్సిపల్ పరిధిలో నేను చేసే అన్ని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అడ్డొస్తున్నారన్నారు. తనకు చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకుం జారీ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో చేష్టలతో నరక ప్రాయంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఉందని ఆవేదన చెందారు. నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా నేను అవమానానికి గురయ్యాను పేర్కొన్నారు. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లానని తెలిపారు. ఎమ్మెల్యే తో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానం పరిచారు అన్నారు. స్నేహితుడి కోసం కొత్త బస్టాండ్ ప్రాతం లో జంక్షన్ చిన్నగా కట్టిన వ్యక్తి ఎమ్మెల్యే, మూడు సంవత్సరాల నుండి నరకం అనుభవిస్తున్నన్నారు. చెప్పకుండా మున్సిపల్ పరిధిలో వార్డ్ సందర్శన చేసినా కూడా తప్పే ఇష్టం ఉన్నట్లుగా ఎమ్మెల్యే మాట్లాఫుతున్నారు అన్నారు. ఒక్క పని కూడా నా చేతులతో ప్రారంభించకుండా చేశారు అన్నారు. మున్సిపల్ అవసరాల నిమిత్తం ట్రాలీలు కొంటె కక్ష పూరితంగా చెప్పకుండా కొన్నామని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కలెక్టర్ ను కలవవద్దని ఎమ్మెల్యే ఆదేశించారు. మీ రేంజ్ ఎంత చిన్న ప్రోటోకాల్ పెట్టుకొని అధికారులను ఎలా కలుస్తారని ఎమ్మెల్యే చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నారు. అనుకూలంగా ఉన్న కొద్దీ మంది కౌన్సిలర్లను టార్గెట్ చేసి, అందరి ముందు అవమానించే వారన్నారు. జగిత్యాల పట్టణంలో బీసీ మహిళననే ఎమ్మెల్యే కక్ష గట్టారని ఆవేదన చెంది, సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా అని కంటతడి పెడుతూ ఆవేదన చెందారు. పేరుకే మున్సిపల్ చైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యే దే అని మండిపడ్డారు. పార్టీకోసమే పని చేస్తామని పలుసార్లు వేడుకున్న కూడా వినకుండా ఎమ్మెల్యే కక్ష గట్టారు అన్నారు. మమ్మల్ని అణచి వేసి ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే గెలిచారు.ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. కమిషనర్ ను బెదిరించి సస్పెండ్ చేస్తాను అని బెదిరించడంతోనే ఆయన లీవ్ పై వెళ్లిన మాట వాస్తవం కాదా అని ప్రశ్న ఆరోపించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత మనుషులమని ఎమ్మెల్యే అణిచివేత గురి చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బెదిరింపులు చేస్తున్నారని, జిల్లా ఎస్ పి ని తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే అడ్డు పడ్డా అభివృద్ధి వైపే ఉన్నామన్నారు. నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎమ్మెల్యే ఇవ్వలేదు అన్నారు. ఆయన స్క్రిప్ట్ ఏ చదవాలని , కవితను కలవకూడదు. కేటీర్ పేరు ప్రస్థావించకూడదు అని హుకుం జారీ చేశారు అన్నారు. ఎమ్మెల్యేతో నరక యాతనకు గురి అయ్యాము అని ఆదరణ చెందారు. ఆశీర్వదిస్తూ కవిత మా ఇంటికి వస్తే ఎమ్మెల్యే వేధింపులు చేశారు అన్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేతో మాకు ఆపద ఉందని. మా కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని ఆవేదన వ్యక్తంచేశారు. రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వేడుకొన్నారు. సహకరించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కె టి ఆర్, కవిత, కొప్పుల ఈశ్వర్ కి, ఎమ్మెల్సీ రమణ అందరికి ధన్యవాదములు తెలుపుతున్నానన్నారు.