అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం
అన్నోన్ ప్రాపర్టీ కింద రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో (192) మోటార్ సైకిళ్ళు, (04) మూడు చక్రాల వాహనాలు మొత్తం 196 వాహనాలపై అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించి కేసులు నమోదు చేసి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు సంబంధిత వాహనయజమానులు ఎవరైనా ఉంటే వాహన డాక్యుమెంట్లు చూపించుకుని వాహనాలను తీసుకొని వెళ్లాలని తెలపడం జరిగింది.
గత 6 నెలల నుండి ఎవరూ రానందున అన్నోన్ ప్రాపర్టీ గా పరిగణించి, బెల్లంపల్లి సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఉంచడం జరిగింది. (06) నెలల కాల వ్యవధి గడువు ముగిసినందున (196) స్క్రాప్ వివిధ రకాల వాహనాలను అన్నోన్ స్క్రాప్ ప్రాపర్టీగా పరిగణించి తేదీ: 30-01-2023 (సోమవారం) రోజున ఉదయం 10:00 గంటలకు వేలం వెయబడును అని ఇంచార్జి రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఓక ప్రకటనలో తెలిపారు.
పోలీస్ కమిషనర్ నియమించిన బహిరంగ వేలానికి సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో తేదీ 30-01-2023 (సోమవారం) రోజున ఉదయం సమయం 10.00 గంటలకు బెల్లంపల్లి సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో
బహిరంగ వేలం పాట వేయబడునని, ఆసక్తిగలవారు వేలంపాటలో పాల్గొని వేలంపాట ద్వారా వాహనాలు స్వాధీనం చేసుకున్న వారు సంబంధిత వేలంపాట డబ్బులు చెల్లించి సంబంధిత వాహనాలను తీసుకుని వెళ్లాలని ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
బహిరంగవేలంలో పాల్గొనలనుకునేవారు, వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డులు ( కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదం పొందినవి ) ఇతర వివరాలు గల పత్రాలు వారి వెంట తీసుకొని రాగలరని, ఇతర వివరాల గురించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరని, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధుకర్ /+91 8712656616, అంజన్న /++91 94940 26036.