తారకరత్న తాజా హెల్త్ అప్ డేట్
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. అతనికి వైద్యులు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కుప్పం ఆస్పత్రిలో అతనికి చికిత్స అందుతుంది. నారా లోకేష్ పాదయాత్రలో ఆయన పాల్గొంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.