జమున మృతి పట్ల మంత్రి ఈశ్వర్ సంతాపం
టాలీవుడ్ సీనియర్ నటి జమున మృతి పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. కన్నడ, తమిళ, హిందీ, భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన జమున ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్రవేసుకున్నారని ఆయన తెలిపారు. 1980లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నికై ప్రజలకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. జమున కుటుంబ సభ్యులకు మంత్రి కొప్పుల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.