Jamuna: సీనియర్ నటి జమున కన్నుమూత
సీనియర్ నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగువారి సత్యభామగా మనల్ని మెప్పించిన తొలి తరం నటి జమున ఇక లేరు.
వయోధికభారంతో, అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమెకిప్పుడు 86 ఏళ్లు. 1953లో పుట్టిల్లు తో సినీ రంగ ప్రవేశం చేశారు నటి జమున. ఎల్వీ ప్రసాద్ తెరకెక్కించిన మిస్సమ్మ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణలాంటి ప్రముఖ హీరోలందరితోనూ లు చేశారు. తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, హిందీ ల్లో నటించారు జమున.