పూరిల్లు దగ్దమైన ఘటనలో బాధితులను పరామర్శించిన మంత్రి సతీమణి
ధర్మపురి నియోజకవర్గం పెగడపెల్లి మండలం లో రాజరాంపల్లి గ్రామంలో బండారి పెద్ద కనుకయ్య కి సంబంధించిన పూరిల్లు సిలిండర్ పేలుడు దాటికి పూర్తిగా దగ్దమవ్వగా ,ఇట్టి విషయమై సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ అసెంబ్లీ సమావేశాల్లో వున్నందువలన మంత్రి ఆదేశాల మేరకు ఆయన సతీమణి కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత విచ్చేసి బాదితున్ని ఆదివారం పరామర్షించి నిత్యావసర సరుకులు బట్టలు అదించడం జరిగింది మరియు మంత్రి తో ఫోన్ లో మాట్లాడించడం జరిగింది. మంత్రి బాదితునితో మాట్లాడుతూ అదైర్య పడవద్దు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. వారి వెంట సర్పంచ్ సాయిని సత్తెమ్మ, ఉపసర్పంచ్ నాగుల రాజశేఖర్ గౌడ్ , వైస్ ఎమ్ పి పి గాజుల గంగాధర్, ఎమ్ పి టీసి కొత్తపెల్లి రవిందర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు లోక మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు సాయిని రవిందర్, నాయకులు బండి వెంకన్న, బండారి కనుకయ్య, ఇటిక్యాల కిరణ్ కుమార్, సింగిరెడ్డి మల్లారెడ్డి, రాచకొండ ఆనంద్, తొట్ల కుమార్, ఆర్ ఐ శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.